అవలోకితేశ్వర తత్వం

బౌద్ధంలో అవలోకితేశ్వర స్వరూపం, ఈ సృష్టిలోని అందరు బుద్ధుల క్షమ,ప్రేమ, దయ తత్వాల సారాన్ని మూర్తీభవింపచేసుకున్న రూపం. అవలోకితేశ్వరుడు సృష్టిలోని జీవులన్నిటికీ బుద్దత్వం పోందడానికి సహాయం చేస్తాడని బౌద్ధుల విశ్వాసం. ఈ జీవాలన్నీ బుద్ధత్వం పోందిన తరువాత తను బుద్ధత్వం పోందాలని నిశ్చయించుకున్న అవలోకితెశ్వరుడికి నమస్సులు .
అవలోకితేశ్వరుడి మరిన్ని  చిత్రాలు ఇక్కడ చూడండి
ఈ అవలోకితేశ్వర తత్వం అనేక జీవాలలో మనుషుల్లో, ముఖ్యంగా పసి పిల్లల్లొ కోన్ని కోన్ని సందర్భాలలో కనిపిస్తోంటుంది. అటువంటి సందర్భం ఒకటి నాకు ఈమధ్య అనుభవంలోకి వచ్చింది. నా నాలుగేళ్ళ కూతురు ఆనఘకి ఈ మధ్య “ఒక కోతి, రెండు పిల్లులు, రోట్టిముక్క” కధ చేప్పేను. తనకి కధ చేప్పిన తరువాత తిరిగి తనచేత అదే కధ చెప్పించుకోవడం అలవాటు. అలాగే కధ చెప్పమంటే పాప ఇలా చేప్పింది” అనగనగా రేండు పిల్లులు ఉన్నాయంట. వాటికి ఒక రోజు ఒక రొట్టిముక్క దొరికిందంట. వాటికి ఒక రోజు ఒక రొట్టిముక్క దొరికిందంట. ఆ రొట్టిముక్కని పంచుకోవడం తెలీక కోతి బావ దగ్గరికి వెళ్ళాయంట. కోతిబావ, కోతిబావా మరేమో ఈ రొట్టి ముక్కని మాకు సమంగా పంచి పెట్టవా అని అడిగాయంట. ఆప్పుడు ఆ కోతిబావ ఆ రొట్టి ముక్కని సమంగ సగం చేసి(!! ??)ఆ ఇద్దరు పిల్లులకీ పెట్టిందంట… ” అని చెప్పేది. పాప తప్పుగా విందేమో అనుకుని, కోతిబావ మోసం చేసి రోట్టిముక్క అంతా తనే తింటుందమ్మ అని చెప్పబోతే, అంతా అయ్యక తన పద్ధతిలోనే కధ చెప్పింది. ఎటువంటి కల్మషం,మోసంతేలియని పసిపాపల మనస్సులోని అవలోకితేశ్వరునికి నా నమస్సులు.

మానవులందరూ సమానంగా ఉండాలన్న దలైలామా, అవలోకితేశ్వర స్వరూపమే. మార్క్సిజం /కమ్మ్యునిజం ఈ ప్రపంచానికి సమానత్వాన్ని సౌభ్రాత్రుత్వాన్ని ఇవ్వగలుగుతాయన్న ఆశనిస్తున్న ఆ అవలోకితేశ్వర స్వరూపానికి నమస్సులు.

ప్రకటనలు

బౌద్ధం – మార్క్సిజం


ఈమధ్య వార్థల్లో చూసే ఉంటారు,టిబెట్ బౌద్ధ గురువు దలయలామ, తను మాక్సిస్టు నని ప్రకటించు కున్నారు. బౌద్ద్దము, మార్క్సిజం పరస్పర పూరకాలన్న్నదే ఈ ప్రతిపాదన అని నా ఉద్దేశం. గత శతాబ్దంలో మానవ జాతికి గొప్ప ఆశని కలగచేసిన ఆదర్శం మార్క్సిజం. అనేక దెశాలలో గొప్ప ప్రయోగాలు జరిగాయి. కొన్ని ఫలితాలు కూడా వచ్చిన సూచనలు ఒక దశలో కనిపించాయి.కారణాలు ఏమైతేనేం, ఈ ప్రయోగాలు/ప్రయత్నాలు విఫలం అయ్యాయి.

దలైలామ టిబెట్ ప్రజల నమ్మకం ప్రకారం అవలోకితేశ్వర బోధిసత్వ స్వరూపం.ఈ బోధిసత్వుడు బౌద్ధ విశ్వాసాల ప్రకారం క్షమ,ప్రేమ, దయా గుణ స్వరూపం. ఈ అవలోకితేశ్వరుడు మరింత మంచి ప్రపంచం కోసం కలలుకంటున్నాడు. మన భవిష్యత్ తరాలు ఈ రెండు గొప్ప ఆలోచనల మేలి కలయికని చూడబోతున్నాయేమో ?

ఆనపానసతి

ఆనపానసతి, బౌద్ధం మనకిచ్చిన గొప్ప బహుమతి. సతి అంటే సచేతనత, అప్రమత్తత, సావధానత అని అర్ధం చెప్పచ్చు.ఆనపాన సతి అంటే ముక్కు నుంచి లోపలికి వచ్చే ప్రతీ శ్వాసనీ గమనించడం, శ్రద్ధగా గమనించడం. ముక్కుని తాకి వచ్చే ప్రతీ శ్వాసా గురించీ సావధానంగా,సచేతనంగా ఉండడం. ముక్కులోనినిచి వచ్చే ప్రతీ శ్వాసా ఎలా ఉదరాన్ని, నాభిని తాకి తిరిగి వస్తూందో గమనించడం. శ్వాసని గమనించడం వల్ల వచ్చే లాభాలు చాలా ఉన్నాయి.

  • శారిరకంగాను, మానసికంగాను ఆరొగ్యాన్నిస్తుంది
  • చక్కటి ఏకాగ్రతని అలవరుస్తుంది
  • అలోచన్ల ప్రవాహంలో(ఊబి లో అందామా ?) కూరుకు పోతున్న సాధకుడిని వాటినుంచి బయట పడెస్తుంది.

ఇటువంటి గొప్ప సాధనాన్ని గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చూడండి

బొధిసత్వ గుణం

ఏప్రిల్ J, 2010 4 వ్యాఖ్యలు

వ్యాకులత చెందని మనస్సు సంక్షొభ సమయల్లో కూడా చేతనంగా ఉండి, ఆ క్షణఫు సౌందర్యాన్ని ఆస్వాదించగలుగుతుంది.

బొధిసత్వ గుణం కలిగిన మనస్సు, అటువంటి సంక్షోభ సమయాల్లొ తను స్థిరంగా ఉంటూ, ఇతరులతో కూడా ఆ క్షణఫు సౌందర్యాన్ని గుర్తింపచేస్తుంది.

దుర్భర శారిరక శ్రమ చేస్తూకూడా, చూడండి, బొధిసత్వుడొకడు, గెంతులేస్తున్న dolphins చూపిస్తున్నాడు.

మూలం

వర్గాలుబౌద్దం ట్యాగులు:,

ఎందుకు బౌద్ధం

ఈ ప్రశ్న చాలా సార్లు నా మనసులో వేసుకుంటాను. సమాధానం బహుముఖమైనది. నీను ఎందుకు బౌద్ధాన్ని ప్రేమిస్తానో చెప్పడానికి ప్రయత్నిస్తాను. The sum is bigger than its parts అన్నట్లుగా ఈ సమాధానాల మొత్తం కన్నా నాకు బౌద్ధం మీద ప్రేమ ఎక్కువ.నేను సాంఘికంగా ఆచరిస్తున్న హిందూ ధర్మం నా మనసు లో ఎందుకు లేదు? నిజంగా లేదా ఆ ప్రభావం? సమాధానించడానికి ప్రయత్నిస్తాను.

నాకు తెలిసిన అన్ని మతాలూ దేముడిని ,దేముడికి- మనిషికి సంబంధాన్ని నిర్వచించడానికి ప్రయత్నిస్తాయి. ఈ నిర్వచనం విశ్వాస సంబంధమైనది. గణిత పరిభాషలో ఇది ఒక presumption. ఈ నిర్వచనం ఆధారంగా వివిధ మతాల సాహిత్యం సృష్టించబడింది.బౌద్ధం దీనికి విరుద్ధంగా మానవుడి దుఃఖానికి వేదనకి కారణాన్ని దానికి నివారణని వెదుకుతుంది.బౌద్ధం నిజానికి దేముడి ఉనికిని కాదనదు. బౌద్ధం agnostic (దేముడు ఉన్నాడు లేడు అని స్పష్టంగా తేల్చని) మతం. బౌద్ధం మనిషి చుట్టూ , మనిషి వేదనల చుట్టూ,మనిషి ఆలోచనల చుట్టూ తిరిగే మతం.

బౌద్ధం నాకు తెలిసిన మతాలన్నిటికన్న ఎక్కువగా మన తల్లి భూమాతని ప్రేమిస్తుంది. జీవితంలోను కళలోను minimalismని ప్రోత్సహిస్తుంది బౌద్ధం. మనచుట్టు ఉన్న జీవరాశుల్ని(మనుషులైనా, జంతువులైనా) గౌరవించడం ప్రేమించడం బౌద్ధం నేర్పిస్తుంది. “I consume, therefore I exist” అనిపించే consumerist మయాజాలంలో చిక్కుకున్న మనకి భౌతిక వాస్తవాన్ని రుచి చూబించగలిగింది బౌద్ధం.

The only constant is change… అని నమ్మేది బౌద్ధం. వేదన,సౌఖ్యంలాంటి భావనలు అనుక్షణం మారేవని, వీటిని సరిగా అర్ధం చెసుకొవడమే దుఖాన్ని జయించడం అని బౌద్ధం ప్రతిపాదిస్తుంది. ఈ చింతన ప్రపంచంలొని తాత్వికతని ఆధ్యాత్మికతని యోగవిద్యని ఒక junction లోకి తీసుకువచ్చే /ప్రతిపాదన.

నేను చూసే మతాల్లోని భేషజం, కర్మకాండ, అసమానతలు బౌద్ధంలో పూర్తిగా లేవని కాదు కాని, చాలా తక్కువ మోతాదులో ఉన్నాయి. అవి కూడ pre-existing మతాల వల్ల సంప్రాప్తించినవే.

హిందూ మతంలోని కొన్ని పార్శ్వాలు, అనుభవాలు ఎప్పటికి నా మనుస్సులో నిలిచి ఉంటాయి. ఈ పార్శ్వాలు, నన్ను నిరంతర అన్వేషణాశీలిని చేశాయి.ఈ పార్శ్వాలే నన్ను నాజీవితాన్ని బౌద్ధంతో పాటుగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి.

వర్గాలుబౌద్దం ట్యాగులు:,

సమ్మ దిత్తి

సమ దృష్టి (పాళీ లో సమ్మ దిత్తి) అన్నది అష్టాంగ మార్గపు తొలి మెట్టు. బౌద్ధ దమ్మ పథంలో ఉన్నవారికి అష్టాంగ మార్గం అంటే తెలిసిందే. మానవ జాతి దుఃఖ నివారణకి తధాగతుడు చూపిన దారే అష్టాంగ మార్గం. ఈదారిలో నడిచిన, నాడుస్తున్నవారందరికీ  ప్రణమిల్లుతూ తప్పటడుగులు నేర్చుకుంటున్నానేను.
English లో బౌద్ధ దమ్మ బ్లాగులు చాలా ఉన్నాయి. తెలుగు లో నేను చూడలేదు కాని ఉండే ఉండవచ్చును. ఇటువంటి బ్లాగులని క్రోడికరించాలని ప్రయత్నం ఈ బ్లాగ్ లో చేస్తాను. నాకు తటస్థించే బౌద్ధ దమ్మ Blogs (ఇంగ్లీష్ వైనా కూడా) ఇక్కడ పరిచయం చేస్తాను. బౌద్ధానికి సంబంధించిన e-books మొదలైన  విషయాలని కూడా ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చేస్తాను.