నిల్వలు

Archive for the ‘ఆధ్యాత్మికం’ Category

సద్గురు చరణం గచ్ఛామి

డిసెంబర్ J, 2011 వ్యాఖ్యానించండి

ఈ సంవత్సరానికి ఆఖరి రోజు.
కొన్ని సంతోషాలు, కొన్ని విషాదాలు,
కొన్ని కొత్త అనుభవాలు, కొన్ని అరిగిపోయిన జ్ఞాపకాలు,
కొంత తీపి, కొంత చేదు -వెరసి గడచి పోయిన సంవత్సరం.

ఎక్కడికి వెళ్ళాలో తెలిసినట్టే ఉన్నా దారి కనిపించని చీకటి
వచ్చే సంవత్సరమైనా దారి చూపే దీపమయ్యే
సద్గురు పాద సన్నిధికి నన్ను చేర్చు ప్రభూ..

 

 

ప్రకటనలు
వర్గాలుఆధ్యాత్మికం

దారి చూపు ప్రభూ…

సెప్టెంబర్ J, 2010 2 వ్యాఖ్యలు

ఈరోజు వెలువడననున్న అయోధ్య తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా ,

పక్క మనిషిని మనిషిగా గౌరవించే మానసిక స్థైర్యాన్ని ప్రసాదించు ప్రభూ.

మతాలన్నిటినీ భగవంతుడి దగ్గరకి వెళ్ళె దారులుగా గుర్తించ గలిగే విజ్ఞతని ప్రసాదించు తండ్రీ.

అల్లానీ రాముణ్ణీ ఒకే గుడిలో కొలువగలిగే భక్తినియ్యి ప్రభూ

సూఫీ సంప్రదాయాన్నించి వికసించిన కబీర్ సాధువు దారి మాకు చూబించు తండ్రీ

దారి చూపు ప్రభూ ఈ చీకటి నుంచి..

ఓం అసతొమా సద్గమయ,
తమసొమా జ్యొతిర్గమయ,
మృత్యొర్మా అమృతం గమయ.
*(O Lord lead us from untruth to truth,Lead us from darkness to light,Lead us from death to immortality.)

ఓం శహనాభవతు, శహనౌభునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వి నావధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతి శాంతి శాంతి
(May He protect both of us. May He nourish both of us. May we both acquire the capacity (to study and understand the scriptures). May our study be brilliant. May we not argue with each other. Om peace, peace, peace.)

వర్గాలుఆధ్యాత్మికం

టావో టె చింగ్ – 1

జూలై J, 2010 6 వ్యాఖ్యలు

పవిత్రతనీ జ్ఞానాన్నీ విసిరేయ్యి
ప్రజలు నూరు రెట్లు సంతోషంగా ఉంటారు

నీతినీ న్యాయాన్నీ పరిత్యజించు
ప్రజలు సరి అయిన దారిలో నడుస్తారు

లాభాన్ని జిగీషనీ వదిలెయ్యి
సమాజంలో దొంగలూ దోపిడీదార్లూ నశిస్తారు

ఇంకా సరిపోలేదా?
వృత్త మధ్యంలో నిలబడి
సమస్తవిషయాలనీ వాటి దారిన జరగనీ

(Lao-tzu – టావో టె చింగ్ – S. Mitchell ఆంగ్లానువాదం నుంచి స్వేచ్చానుసరణ)

టావో టె చింగ్ – టావో అధ్యత్మికతకి మూలమైన ఈ ఛైనీస్ పుస్తకం Eckhart Tolle అనే సమకాలీన ఆధ్యత్మికవేత్త చేత “గొప్ప పుస్తకాలలొ ఒకటి” అని కొనియాడబడింది.

నాకు తెలిసి తెలుగులో దీన్ని ఎవరూ పూర్తిగా అనువదించలేదు. కొన్ని విడి పద్యాలని అనువదించడం జరిగిందనుకుంటా. పూర్తి అనువాదం గురించి ఎవరికైనా తెలిస్తే, చెప్పగలర

అవలోకితేశ్వర తత్వం

బౌద్ధంలో అవలోకితేశ్వర స్వరూపం, ఈ సృష్టిలోని అందరు బుద్ధుల క్షమ,ప్రేమ, దయ తత్వాల సారాన్ని మూర్తీభవింపచేసుకున్న రూపం. అవలోకితేశ్వరుడు సృష్టిలోని జీవులన్నిటికీ బుద్దత్వం పోందడానికి సహాయం చేస్తాడని బౌద్ధుల విశ్వాసం. ఈ జీవాలన్నీ బుద్ధత్వం పోందిన తరువాత తను బుద్ధత్వం పోందాలని నిశ్చయించుకున్న అవలోకితెశ్వరుడికి నమస్సులు .
అవలోకితేశ్వరుడి మరిన్ని  చిత్రాలు ఇక్కడ చూడండి
ఈ అవలోకితేశ్వర తత్వం అనేక జీవాలలో మనుషుల్లో, ముఖ్యంగా పసి పిల్లల్లొ కోన్ని కోన్ని సందర్భాలలో కనిపిస్తోంటుంది. అటువంటి సందర్భం ఒకటి నాకు ఈమధ్య అనుభవంలోకి వచ్చింది. నా నాలుగేళ్ళ కూతురు ఆనఘకి ఈ మధ్య “ఒక కోతి, రెండు పిల్లులు, రోట్టిముక్క” కధ చేప్పేను. తనకి కధ చేప్పిన తరువాత తిరిగి తనచేత అదే కధ చెప్పించుకోవడం అలవాటు. అలాగే కధ చెప్పమంటే పాప ఇలా చేప్పింది” అనగనగా రేండు పిల్లులు ఉన్నాయంట. వాటికి ఒక రోజు ఒక రొట్టిముక్క దొరికిందంట. వాటికి ఒక రోజు ఒక రొట్టిముక్క దొరికిందంట. ఆ రొట్టిముక్కని పంచుకోవడం తెలీక కోతి బావ దగ్గరికి వెళ్ళాయంట. కోతిబావ, కోతిబావా మరేమో ఈ రొట్టి ముక్కని మాకు సమంగా పంచి పెట్టవా అని అడిగాయంట. ఆప్పుడు ఆ కోతిబావ ఆ రొట్టి ముక్కని సమంగ సగం చేసి(!! ??)ఆ ఇద్దరు పిల్లులకీ పెట్టిందంట… ” అని చెప్పేది. పాప తప్పుగా విందేమో అనుకుని, కోతిబావ మోసం చేసి రోట్టిముక్క అంతా తనే తింటుందమ్మ అని చెప్పబోతే, అంతా అయ్యక తన పద్ధతిలోనే కధ చెప్పింది. ఎటువంటి కల్మషం,మోసంతేలియని పసిపాపల మనస్సులోని అవలోకితేశ్వరునికి నా నమస్సులు.

మానవులందరూ సమానంగా ఉండాలన్న దలైలామా, అవలోకితేశ్వర స్వరూపమే. మార్క్సిజం /కమ్మ్యునిజం ఈ ప్రపంచానికి సమానత్వాన్ని సౌభ్రాత్రుత్వాన్ని ఇవ్వగలుగుతాయన్న ఆశనిస్తున్న ఆ అవలోకితేశ్వర స్వరూపానికి నమస్సులు.

ఆనపానసతి

ఆనపానసతి, బౌద్ధం మనకిచ్చిన గొప్ప బహుమతి. సతి అంటే సచేతనత, అప్రమత్తత, సావధానత అని అర్ధం చెప్పచ్చు.ఆనపాన సతి అంటే ముక్కు నుంచి లోపలికి వచ్చే ప్రతీ శ్వాసనీ గమనించడం, శ్రద్ధగా గమనించడం. ముక్కుని తాకి వచ్చే ప్రతీ శ్వాసా గురించీ సావధానంగా,సచేతనంగా ఉండడం. ముక్కులోనినిచి వచ్చే ప్రతీ శ్వాసా ఎలా ఉదరాన్ని, నాభిని తాకి తిరిగి వస్తూందో గమనించడం. శ్వాసని గమనించడం వల్ల వచ్చే లాభాలు చాలా ఉన్నాయి.

  • శారిరకంగాను, మానసికంగాను ఆరొగ్యాన్నిస్తుంది
  • చక్కటి ఏకాగ్రతని అలవరుస్తుంది
  • అలోచన్ల ప్రవాహంలో(ఊబి లో అందామా ?) కూరుకు పోతున్న సాధకుడిని వాటినుంచి బయట పడెస్తుంది.

ఇటువంటి గొప్ప సాధనాన్ని గురించి తెలుసుకునేందుకు ఇక్కడ చూడండి