అవలోకితేశ్వర తత్వం

బౌద్ధంలో అవలోకితేశ్వర స్వరూపం, ఈ సృష్టిలోని అందరు బుద్ధుల క్షమ,ప్రేమ, దయ తత్వాల సారాన్ని మూర్తీభవింపచేసుకున్న రూపం. అవలోకితేశ్వరుడు సృష్టిలోని జీవులన్నిటికీ బుద్దత్వం పోందడానికి సహాయం చేస్తాడని బౌద్ధుల విశ్వాసం. ఈ జీవాలన్నీ బుద్ధత్వం పోందిన తరువాత తను బుద్ధత్వం పోందాలని నిశ్చయించుకున్న అవలోకితెశ్వరుడికి నమస్సులు .
అవలోకితేశ్వరుడి మరిన్ని  చిత్రాలు ఇక్కడ చూడండి
ఈ అవలోకితేశ్వర తత్వం అనేక జీవాలలో మనుషుల్లో, ముఖ్యంగా పసి పిల్లల్లొ కోన్ని కోన్ని సందర్భాలలో కనిపిస్తోంటుంది. అటువంటి సందర్భం ఒకటి నాకు ఈమధ్య అనుభవంలోకి వచ్చింది. నా నాలుగేళ్ళ కూతురు ఆనఘకి ఈ మధ్య “ఒక కోతి, రెండు పిల్లులు, రోట్టిముక్క” కధ చేప్పేను. తనకి కధ చేప్పిన తరువాత తిరిగి తనచేత అదే కధ చెప్పించుకోవడం అలవాటు. అలాగే కధ చెప్పమంటే పాప ఇలా చేప్పింది” అనగనగా రేండు పిల్లులు ఉన్నాయంట. వాటికి ఒక రోజు ఒక రొట్టిముక్క దొరికిందంట. వాటికి ఒక రోజు ఒక రొట్టిముక్క దొరికిందంట. ఆ రొట్టిముక్కని పంచుకోవడం తెలీక కోతి బావ దగ్గరికి వెళ్ళాయంట. కోతిబావ, కోతిబావా మరేమో ఈ రొట్టి ముక్కని మాకు సమంగా పంచి పెట్టవా అని అడిగాయంట. ఆప్పుడు ఆ కోతిబావ ఆ రొట్టి ముక్కని సమంగ సగం చేసి(!! ??)ఆ ఇద్దరు పిల్లులకీ పెట్టిందంట… ” అని చెప్పేది. పాప తప్పుగా విందేమో అనుకుని, కోతిబావ మోసం చేసి రోట్టిముక్క అంతా తనే తింటుందమ్మ అని చెప్పబోతే, అంతా అయ్యక తన పద్ధతిలోనే కధ చెప్పింది. ఎటువంటి కల్మషం,మోసంతేలియని పసిపాపల మనస్సులోని అవలోకితేశ్వరునికి నా నమస్సులు.

మానవులందరూ సమానంగా ఉండాలన్న దలైలామా, అవలోకితేశ్వర స్వరూపమే. మార్క్సిజం /కమ్మ్యునిజం ఈ ప్రపంచానికి సమానత్వాన్ని సౌభ్రాత్రుత్వాన్ని ఇవ్వగలుగుతాయన్న ఆశనిస్తున్న ఆ అవలోకితేశ్వర స్వరూపానికి నమస్సులు.

  1. 7:31 సా. వద్ద మే J, 2010

    picture is good.

  1. 3:50 ఉద. వద్ద మే J, 2010

వ్యాఖ్యానించండి