సద్గురు చరణం గచ్ఛామి

డిసెంబర్ J, 2011 వ్యాఖ్యానించండి

ఈ సంవత్సరానికి ఆఖరి రోజు.
కొన్ని సంతోషాలు, కొన్ని విషాదాలు,
కొన్ని కొత్త అనుభవాలు, కొన్ని అరిగిపోయిన జ్ఞాపకాలు,
కొంత తీపి, కొంత చేదు -వెరసి గడచి పోయిన సంవత్సరం.

ఎక్కడికి వెళ్ళాలో తెలిసినట్టే ఉన్నా దారి కనిపించని చీకటి
వచ్చే సంవత్సరమైనా దారి చూపే దీపమయ్యే
సద్గురు పాద సన్నిధికి నన్ను చేర్చు ప్రభూ..

 

 

వర్గాలుఆధ్యాత్మికం

పాత పుస్తకాల నిధి

జనవరి J, 2011 1 వ్యాఖ్య

ఆంధ్ర శబ్దమంజరి : http://www.scribd.com/doc/38606483/Andhra-SabdaManjari

భరత రస ప్రకరణము : http://www.scribd.com/doc/38603987/Bharatharasaprakaranam-1932

శబ్దార్ధ చంద్రిక : http://www.scribd.com/doc/38606315/Sabdardha-Chandrika-Telugu-Dictionary-1942-Ok

ఆంధ్ర విష్ణు పురాణము : http://www.scribd.com/doc/38541897/Andhra-VishnuPuranamau-1939-ok

శుక సప్తశతి : http://www.scribd.com/doc/38599729/Suka-Sapthathi-Kadhalu

అష్టోత్తర శతోపనిషత్ : Sathopanishad{Telugu 1928} http://www.scribd.com/doc/38541897/Andhra-VishnuPuranamau-1939-ok

ప్రబంధ రత్నవళి : http://www.scribd.com/doc/38598656/Prabandha-Ratnavali-ok

మాఘ కావ్యమ్ : http://www.scribd.com/doc/38603743/Maagha-Kaavyam-3-Cantos-1914-Ok

వర్గాలుసాహిత్యం

Dialogue in the Dark- చిమ్మ చీకటి లో సంభాషణ

డిసెంబర్ J, 2010 వ్యాఖ్యానించండి

“Only way to learn is to encounter” – Martin Buber

నిన్న ఒక అసాధారణమైన అనుభవం కలిగింది. మా సంస్థ వారు “Dialogue in the Dark” అనే event కి మమ్మల్ని పంపించడంతో ఒక కొత్త ప్రపంచం నా ముందు ఆవిష్కృతమయ్యింది.ఒక గంట వ్యవధి లో మనకు తెలియని మనల్ని పరిచయం చేస్తుంది –ఈ ప్రయోగం. చూపు లేనివారి మీద నాకు సానుభూతి ఉండేది. ఈ అనుభవం తరువాత ఇది వారి మీద గౌరవం గాను,అబిమానం , Inspiration గాను మారింది.

ఈ గంట సేపూ నా మనస్సు “ పూర్న మనస్కత” (Mindfullness) తో ఉండడం నాకు సంతోషాన్నిచ్చింది. ఈ ప్రదర్శన/ ప్రయోగం లో పాల్గొనే అవకాశ౦ మీకెవరికయినా వస్తే తప్పక చూడండి (!! ఆనుభవించండి).

Dialogue in the Dark
Level 5 Inorbit Mall
Hi- Tech City
Madhapur
Hyderabad
E-mail: info@experienceace.com
URL: http://www.dialogueinthedarkindia.com
Please book in advance!
Ticketing and reservations open this November. We’re looking forward to seeing you there. In the meantime, you can contact us at info@experienceace.com
Phone: (+91) 40 64603341 or (+91) 40 64603342
Opening hours
Tuesday to Sunday: 10 a.m. – 8 p.m.

మంచి కధ – వాడ్రేవు చినవీరభద్రుడి “చివరి మనిషి”

అక్టోబర్ J, 2010 1 వ్యాఖ్య

చాలా రోజుల తరువాత ఒక మంచి కధని చదివిన అనుభూతి కలిగింది ఈ కధ చదివి. చూడండి :
వాడ్రేవు చినవీరభద్రుడి

అందరికీ దసరా శుభాకాంక్షలు

వర్గాలుకధలు, సాహిత్యం ట్యాగులు:

దారి చూపు ప్రభూ…

సెప్టెంబర్ J, 2010 2 వ్యాఖ్యలు

ఈరోజు వెలువడననున్న అయోధ్య తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా ,

పక్క మనిషిని మనిషిగా గౌరవించే మానసిక స్థైర్యాన్ని ప్రసాదించు ప్రభూ.

మతాలన్నిటినీ భగవంతుడి దగ్గరకి వెళ్ళె దారులుగా గుర్తించ గలిగే విజ్ఞతని ప్రసాదించు తండ్రీ.

అల్లానీ రాముణ్ణీ ఒకే గుడిలో కొలువగలిగే భక్తినియ్యి ప్రభూ

సూఫీ సంప్రదాయాన్నించి వికసించిన కబీర్ సాధువు దారి మాకు చూబించు తండ్రీ

దారి చూపు ప్రభూ ఈ చీకటి నుంచి..

ఓం అసతొమా సద్గమయ,
తమసొమా జ్యొతిర్గమయ,
మృత్యొర్మా అమృతం గమయ.
*(O Lord lead us from untruth to truth,Lead us from darkness to light,Lead us from death to immortality.)

ఓం శహనాభవతు, శహనౌభునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వి నావధీతమస్తు మావిద్విషావహై
ఓం శాంతి శాంతి శాంతి
(May He protect both of us. May He nourish both of us. May we both acquire the capacity (to study and understand the scriptures). May our study be brilliant. May we not argue with each other. Om peace, peace, peace.)

వర్గాలుఆధ్యాత్మికం

ఆ తోటలోనొకటి ఆరాధనాలయము…

సెప్టెంబర్ J, 2010 3 వ్యాఖ్యలు

చాల రోజులుగా వెతుకుతున్న పాట (ఆ తోటలోనొకటి ఆరాధనాలయము) ఈరోజు శ్యామ నారాయణ గారి(Old Telugu songs collector) వలన వినడం జరిగింది. ఈ పాట నా చిన్నప్పుడు ఎవరో పాడగా వినడం జరిగింది. మళ్ళి వినాలనుకున్నా ఎక్కడా దొరకలేదు. ఈన్నాళ్ళకి శ్యామ నారాయణ గారిని request చేస్తే ఆయన పంపించారు. ఈ పాట తధాగతుడి గురించినది కావడం యాధృచ్చికం కాదు.
ఇక్కడ వినండి.

వర్గాలుపాటలు, బౌద్దం

టావో టె చింగ్ – 1

జూలై J, 2010 6 వ్యాఖ్యలు

పవిత్రతనీ జ్ఞానాన్నీ విసిరేయ్యి
ప్రజలు నూరు రెట్లు సంతోషంగా ఉంటారు

నీతినీ న్యాయాన్నీ పరిత్యజించు
ప్రజలు సరి అయిన దారిలో నడుస్తారు

లాభాన్ని జిగీషనీ వదిలెయ్యి
సమాజంలో దొంగలూ దోపిడీదార్లూ నశిస్తారు

ఇంకా సరిపోలేదా?
వృత్త మధ్యంలో నిలబడి
సమస్తవిషయాలనీ వాటి దారిన జరగనీ

(Lao-tzu – టావో టె చింగ్ – S. Mitchell ఆంగ్లానువాదం నుంచి స్వేచ్చానుసరణ)

టావో టె చింగ్ – టావో అధ్యత్మికతకి మూలమైన ఈ ఛైనీస్ పుస్తకం Eckhart Tolle అనే సమకాలీన ఆధ్యత్మికవేత్త చేత “గొప్ప పుస్తకాలలొ ఒకటి” అని కొనియాడబడింది.

నాకు తెలిసి తెలుగులో దీన్ని ఎవరూ పూర్తిగా అనువదించలేదు. కొన్ని విడి పద్యాలని అనువదించడం జరిగిందనుకుంటా. పూర్తి అనువాదం గురించి ఎవరికైనా తెలిస్తే, చెప్పగలర